: శ్రీలంక సిరీస్ కు ఎంపికైన భారత జట్టు ఇదే!
శ్రీలంక సిరీస్ కు భారత జట్టును సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్న శ్రీలంకతో సిరీస్ లో మూడు టీట్వంటీలు ఆడనున్నారు. పూణే, రాంచీ, విశాఖపట్టణంలలో ఈ మూడు మ్యాచ్ లు జరగనున్నాయి. ఆస్ట్రేలియాను క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు మరోసారి అలాంటి ప్రదర్శనతో టీట్వంటీ వరల్డ్ కప్ కు సిద్ధం కావాలని టీమిండియా సెలెక్టర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత జట్టును ఎంపిక చేశారు. టీమిండియాలో చోటు సంపాదించిన ఆటగాళ్ల వివరాలు... మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, సురేష్ రైనా, యువరాజ్ సింగ్, అజింక్యా రహానే, మనీష్ పాండే, రవీంద్ర జడేజా, రవి చంద్రన్ అశ్విన్, హార్డిక్ పాండ్య, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, ఆశిష్ నెహ్రా, హర్భజన్, పవన్ నేగీలను ఎంపిక చేశారు.