: చార్జింగ్ పెట్టిన ఫోన్ పేలడంతో ఇల్లు దగ్ధం!
చెన్నై కోయంబేడు సమీపంలోని నెర్ కుండ్రంకు చెందిన పూల వ్యాపారి ఇంట్లో చార్జింగ్ పెట్టిన ఫోన్ పేలి మంటలు వ్యాపించడంతో ఇల్లు దగ్ధమైంది. బుధవారం రాత్రి తన ఫోన్ కు చార్జింగ్ పెట్టి వ్యాపారి ఝాన్సీ నిద్రపోయింది. గురువారం తెల్లవారుజామున సెల్ ఫోన్ ప్రమాదవశాత్తు పేలడంతో మంటలు వ్యాపించాయి. ఇంటిపై కప్పుకు మంటలు వ్యాపించడంతో ఇల్లు దగ్ధమైంది. ఈ సంఘటతో సదరు కుటుంబసభ్యులు, స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందడంతో వారు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు.