: నిఘా, సెక్యూరిటీ, సీఐడీ విభాగాల్లోని ఉద్యోగులకు 25 శాతం అలవెన్సు: కేసీఆర్
పోలీస్ శాఖలోని నిఘా విబాగం, సెక్యూరిటీ, సీఐడీ విభాగం ఉద్యోగులకు మూలవేతనంపై 25 శాతం అలవెన్సును తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇంటెలిజెన్స్ విభాగంలో 464 మందికి, సెక్యూరిటీ విభాగంలో 893 మందికి, సీఐడీ విభాగంలో 646 మంది ఉద్యోగులకు జీతాలు పెంచుతున్నట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. అలాగే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వేగవంతంగా జరగాలని అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో ఇవాళ పలు విభాగాల ఉన్నతాధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాకు వివరాలను తెలిపారు. హైదరాబాద్ లో అదనంగా రెండు ప్రభుత్వాసుపత్రులను నిర్మించాలని, బొగ్గుగని కార్మికుల వైద్యం కోసం కోల్ బెల్టులో కూగీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలనుకుంటున్నామని చెప్పారు.