: ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ కు కెప్టెన్ ధోనీనే!... రెండు టోర్నీలకు జట్టు ఎంపిక
ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ సిరీస్ లకు టీమిండియా జట్లకు మహేంద్ర సింగ్ ధోనీనే నాయకత్వం వహించనున్నాడు. ఈ మేరకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కొద్దిసేపటి క్రితం రెండు సిరీస్ లకు 15 మందితో కూడిన ఒకే జట్టును ఎంపిక చేసింది. రెండు సిరీస్ లకు ధోనీనే నాయకత్వం వహించనున్నట్లు చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్, బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. ఆయా సిరీస్ లకు ఈ జాబితా నుంచే ఆటగాళ్లను ఖరారు చేస్తారు. జట్టు వివరాలు: మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్, అజింక్యా రెహానే, సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, పవన్ నేగి, హర్భజన్ సింగ్, ఆశిష్ నెహ్రా, మొహ్మద్ షమీ, బుమ్రా, పాండ్యా