: ఎక్స్ అఫీషియో సభ్యత్వంపై ఆర్డినెన్స్ ను గవర్నర్ ఎలా ఆమోదిస్తారు?: టి.కాంగ్రెస్
ఎమ్మెల్సీల ఎక్స్ అఫీషియో సభ్యత్వంపై ఆర్డినెన్స్ ను హడావుడిగా ఆమోదింపజేసుకోవడంపై టి.కాంగ్రెస్ మండిపడుతోంది. గతంలో జారీ చేసిన 207 జీవోను రద్దు చేసి ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని ఖండిస్తున్నామని ఆ పార్టీ పీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. టీఆర్ఎస్ చీకటి రాజకీయాలకు ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు. అసలు ఆ అంశం కోర్టు పరిధిలో ఉండగా ఆర్డినెన్స్ ను గవర్నర్ ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు. చట్టసభలను అగౌరపరిచే విధంగా దొడ్డిదారిన ఆర్డినెన్స్ తెచ్చారని శ్రవణ్ ఆరోపించారు. ఐఏఎస్ అధికారులు టీఆర్ఎస్ సేవకులుగా పని చేస్తున్నారని, ఇలాంటి అధికారులు దొరకడం తెలంగాణ దౌర్భాగ్యమని మండిపడ్డారు.