: పోలీసుల చక్రబంధంలో తూర్పుగోదావరి జిల్లా... కిర్లంపూడి పరిసరాల్లో మరింత కట్టుదిట్టమైన భద్రత
కాపులకు రిజర్వేషన్లను డిమాండ్ చేేస్తూ సీనియర్ రాజకీయ వేత్త, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టనున్న ఆమరణ నిరాహార దీక్ష మరికాసేపట్లో ప్రారంభం కానుంది. తూర్పుగోదావరి జిల్లా తునిలోని కొబ్బరి తోటల్లో ఇటీవల జరిగిన ‘కాపు ఐక్య గర్జన’ హింసాత్మకంగా మారిన నేపథ్యంలో నేటి ముద్రగడ దీక్ష సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు తూర్పుగోదావరి జిల్లా మొత్తాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. జిల్లాలోకి బయటి వ్యక్తులు ప్రవేశించకుండా ముమ్మరంగా తనిఖీలు జరుగుతున్నాయి. జిల్లాలోని ప్రత్తిపాడు మండలం కిర్లంపూడిలోని తన సొంతింటిలో భార్యతో కలిసి ముద్రగడ ఆమరణ దీక్షకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో కాపుల నుంచి భారీ ఎత్తున సంఘీభావం వ్యక్తం కానున్న నేపథ్యంలోనే భద్రతను కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.