: బ్లడ్ కారుతున్నా... డ్యాన్స్ చేశాడు: భీమినేని
సినిమా అంటే బెల్లంకొండ శ్రీనివాస్ కు ప్రాణం అని, డ్యాన్స్ మూవ్ మెంట్స్ బాగా చేస్తాడని దర్శకుడు భీమినేని శ్రీనివాస్ కితాబు ఇచ్చారు. "శ్రీనివాస్ డెడికేషన్ గురించి చెప్పాలంటే.. ఓ రోజు ఈ చిత్రంలోని ఒక పాటలో డ్యాన్స్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నాము. మోకాళ్లపై కూర్చుని ఆ డ్యాన్స్ చేయాలి. అది చాలా టఫ్ మూవ్ మెంట్. అతని మోకాళ్ల నుంచి రక్తం కారుతున్నా కూడా అట్లానే డ్యాన్స్ చేశాడు. అయినప్పటికీ అతని ఫేస్ లో నవ్వు మాత్రం పోలేదు. నవ్వుతూనే డ్యాన్స్ చేస్తున్నాడు. అప్పుడు నేనన్నాను.. డ్యాన్స్ సన్నివేశాలను తర్వాత చిత్రీకరిద్దామని. అందుకు అతను ఒప్పుకోలేదు. తనకు ఏమాత్రం ఇబ్బంది లేదని ఫినిష్ చేసేద్దామన్నాడు. 'దెబ్బదేముంది.. మానిపోతుందిలేండి' అన్నాడు. అతని డెడికేషన్ కు ఇదే చక్కని నిదర్శనం" అని చెప్పారు భీమినేని.