: కన్నడ కమెడియన్ బుల్లెట్ ప్రకాశ్ ను చంపేస్తామంటూ బెదిరింపు


కన్నడ సినీ హాస్యనటుడు బుల్లెట్ ప్రకాశ్ ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. కన్నడ సూపర్ స్టార్ దర్శన్ సోదరుడు దినకర్ తూగదీప్ తనను చంపేస్తానని బెదిరించాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు రక్షణ కల్పించాలని కోరాడు. తన కుమార్తె సమక్షంలోనే ఆయన ఇలా బెదిరించాడని, అందుకు తన కూతురే సాక్షి అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ప్రకాశ్ వివరించాడు. తనపట్ల మరీ నీచంగా ప్రవర్తించాడని, అంతేగాక తన ఫిర్యాదును వెనక్కు తీసుకోవాలని దర్శన్ అనుచరులు వేధిస్తున్నారని తెలిపాడు. మంచి స్నేహితులైన బుల్లెట్ ప్రకాశ్, దర్శన్ లు అనేక హిట్ సినిమాల్లో నటించారు. ఈ క్రమంలో దర్శన్ తో ఓ సినిమా నిర్మిస్తానని ఆ మధ్య ప్రకాశ్ ప్రకటించాడు. ఏమైందోగానీ ఆ ప్రయత్నం కుదరలేదు. కానీ దర్శన్ సోదరుడు దినకర్, ప్రకాశ్ కు మధ్య విభేదాలు వచ్చాయి. దాంతో గొడవ మరింత పెద్దదై బెదిరింపులు చేసుకునే స్థాయికి వెళ్లింది.

  • Loading...

More Telugu News