: మేయర్ పదవికోసమే పాతబస్తీ దాడిపై కేసీఆర్ స్పందించడం లేదు: ఎమ్మెల్సీ పొంగులేటి


పాతబస్తీలో కాంగ్రెస్ నేతలపైన, బీజేపీకి చెందిన అభ్యర్థిపైన ఎంఐఎం దాడులు చేసినా ఇంతవరకు సీఎం కేసీఆర్ స్పందించకపోవడాన్ని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. రెండు రోజులు గడుస్తున్నా సీఎం మాట్లాడకపోవడం దారుణమని మీడియా సమావేశంలో మండిపడ్డారు. మేయర్ పదవి కోసమే కేసీఆర్ మౌనంగా ఉంటున్నారని ఆరోపించారు. ఇక మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ లో తమ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీపై కేసులు పెట్టడం హాస్యాస్పదమన్నారు. వెంటనే వారిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని పొంగులేటి డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News