: ఏ కులానికీ అన్యాయం జరగని విధంగా నివేదిక అందిస్తాం: జస్టిస్ మంజునాథ్
విజయవాడలో ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ ముగిసిన తరువాత బీసీ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ మంజునాథ్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును మర్యాదపూర్వకంగానే కలిశానని చెప్పారు. ఏ కులానికీ అన్యాయం జరగని విధంగా నివేదిక అందిస్తామని చెప్పారు. అయితే రిజర్వేషన్లపై అంతిమ నిర్ణయం మాత్రం ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విధివిధానాలను ఖరారు చేసి త్వరలో అందిస్తానందని, అవి ఖరారు కాగానే తమ పని ప్రారంభిస్తామని తెలిపారు. అయితే నివేదికను 9 నెలలలో ఇవ్వడమా? లేక అంతకంటే ముందే ఇవ్వడమా? అనేది ఇప్పుడే చెప్పలేనని అన్నారు. కాపుల జనాభాకు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి గణాంకాలు లేవని మంజునాథ్ చెప్పారు. త్వరలో ఏపీలోని 13 జిల్లాలో పర్యటించి కాపులు, బీసీల అభిప్రాయాలు సేకరిస్తామని వెల్లడించారు.