: చెన్నై విమానాశ్రయంలో హ్యాండ్ బ్యాగ్ కలకలం!
చెన్నై విమానాశ్రయంలో ఎవరో ప్రయాణికులు వదిలివెళ్లిన ఓ హ్యాండ్ బ్యాగ్ కలకలం సృష్టించింది. ఆ హ్యాండ్ బ్యాగ్ ను ఎవరూ తీసుకెళ్లకపోవడంతో ఆ విషయాన్ని భద్రతా సిబ్బందికి, బాంబు స్క్వాడ్ కు తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకున్న వారు ఆ హ్యాండ్ బ్యాగ్ ను పరిశీలించారు. అందులో ఎటువంటి అనుమానాస్పద వస్తువులను వారు గుర్తించలేదు. ఆ హ్యాండ్ బ్యాగ్ ను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కి అప్పగించడంతో విమాన ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.