: టాంజానియా మహిళను వివస్త్రను చేసి ఊరేగించారనడం అసత్యం: కర్ణాటక హోంమంత్రి
బెంగళూరులో నాలుగు రోజుల కిందట టాంజానియా మహిళపై జరిగిన అమానుష ఘటనపై కర్ణాటక హోంశాఖ మంత్రి జి.పరమేశ్వర స్పందించారు. ఆ మహిళను వివస్త్రను చేసి ఊరేగించారనడం అసత్యమని చెప్పారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఐదురుగు నిందితులను అరెస్టు చేశారని, వారిని పోలీసులు విచారిస్తున్నారని తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖకు కూడా తెలియజేశామని వివరించారు. అయితే ఇలాంటి సంఘటనలు మళ్లీ చోటుచేసుకోకుండా చూసుకుంటామన్నారు. ఘటనను సీరియస్ గా తీసుకుని, పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. బెంగళూరులో మొత్తం 12వేల మంది విదేశీ విద్యార్థులు చదువుకుంటున్నారని, వారిని రక్షించే బాధ్యత తమదేనని మంత్రి స్పష్టం చేశారు.