: మీకేం తెలిసినా 94409 04859కు వాట్స్ యాప్ చేయండి: కాపులకు పోలీసుల సూచన
ఇటీవల తుని సమీపంలో జరిగిన కాపు గర్జన అనంతరం చోటుచేసుకున్న విపత్కర పరిణామాలపై ఎవరివద్ద ఎటువంటి సమాచారమున్నా 94409 04859కు వాట్స్ యాప్ చేయాలని పోలీసులు కోరుతున్నారు. ఈ సదస్సుకు కొన్ని లక్షల మంది రావడం, ఆపై రైలు దహనం, పోలీసు స్టేషన్లలో విధ్వంసం తదితర ఘటనల్లో ఇప్పటికే 150 మంది అనుమానితులను గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గర్జన సదస్సుకు వచ్చిన వారిలో అత్యధికులు ఏదో ఒక సందర్భంలో ఫోటోలు, వీడియోలు తీసి వుంటారని భావిస్తున్న పోలీసులు, వాటన్నింటినీ తమకు పంపాలని సూచిస్తున్నారు. ముఖాలకు ముసుగులు వేసుకుని కనిపిస్తున్న పలువురు, అంతకుముందు సదస్సులో ముసుగులు ధరించకపోవచ్చని అంచనా వేస్తున్న పోలీసులు, సదస్సు కార్యకర్తలు తీసిన చిత్రాల్లో వారు కనిపించవచ్చని భావిస్తున్నారు. ముసుగులు ధరించిన వారి దుస్తుల ఆధారంగా, ఈ వాట్స్ యాప్ కు వచ్చే చిత్రాల్లో ముఖాలను గుర్తించే అవకాశాలు ఉంటాయన్న కోణంలో, అన్ని చిత్రాలు, వీడియోలను తమకు పంపాలని కోరుతూ, ప్రత్యేక సెల్ నంబరును ప్రకటించారు.