: బోగీలు దొరకడం లేదు, 'రత్నాచల్' ఇప్పట్లో అనుమానమే!: రైల్వే శాఖ


రత్నాచల్ ఎక్స్ ప్రెస్... విజయవాడ నుంచి విశాఖపట్నం మధ్య తిరిగే సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్. ఈ రైలును నమ్ముకుని నిత్యమూ వందలాది మంది తమ ఆఫీసులకు వెళ్లి, తిరిగి వస్తుంటారు. ఈ రైలును ఇటీవలి కాపు గర్జన సందర్భంగా తుని సమీపంలో తగులబెట్టగా, అప్పటి నుంచి ఈ సర్వీసును తిరిగి పునరుద్ధరించలేదు. చైర్ కార్, సెకండ్ సీటింగ్ కోచ్ లు కలిపి మొత్తం 24 బోగీలతో తిరిగే ఈ రైలుకు ఇంకా బోగీలు సమకూరలేదు. రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కు బోగీలను సమకూర్చాలని రైల్వే బోర్డుకు లేఖ రాసినట్టు విజయవాడ డివిజన్ రీజనల్ మేనేజర్ అశోక్ కుమార్ తెలిపారు. బోగీలను సమకూర్చుకోవడం తమకు కష్టంగా ఉందని ఆయన అన్నారు. ముఖ్యంగా చైర్ కార్ బోగీలు లభించడం లేదని, వచ్చే రెండు మూడు రోజుల్లో కూడా సర్వీసును ప్రారంభించలేక పోవచ్చని తెలిపారు.

  • Loading...

More Telugu News