: పురానాపూల్ రీపోలింగ్ ఎఫెక్ట్!... గ్రేటర్ ఓట్ల లెక్కింపు రేపు సాయంత్రం 4 గంటలకు వాయిదా!


గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ఓట్ల లెక్కింపు సాధారణంగా రేపు ఉదయమే ప్రారంభం కావాల్సి ఉంది. షెడ్యూల్ లో భాగంగా ఎన్నికల సంఘం ఈ మేరకు స్పష్టంగా ప్రకటించింది. అయితే కాంగ్రెస్, మజ్లిస్ ల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ ఫలితంగా పురానాపూల్ డివిజన్ లో రీపోలింగ్ తప్పలేదు. కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదుతో రేపు పురానాపూల్ పరిధిలోని 36 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహణకు నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రేపు ఉదయం ప్రారంభం కావాల్సిన ఓట్ల లెక్కింపు (కౌంటింగ్)ను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అంటే, నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం రేపు మధ్యాహ్నంలోగా పూర్తిగా వెలువడాల్సిన ఎన్నికల ఫలితాలు, రాత్రికి గాని వెలువడవన్నమాట.

  • Loading...

More Telugu News