: ధోనీకిచ్చే గౌరవం వెలకట్టలేనిది: గంగూలి


ధోనీకి డ్రెస్సింగ్ రూమ్ లో తోటి ఆటగాళ్లు ఇచ్చే గౌరవం, అభిమానులు చూపించే ఆదరణ వెలకట్టలేనివని భారత మాజీ క్రికెటర్ గంగూలి అన్నాడు. కొంత కాలంగా ధోనీ కెప్టెన్సీ, అతని ఆటతీరుపై వస్తున్న విమర్శల గురించి గంగూలి మాట్లాడుతూ, ఒక జట్టు కెప్టెన్ కి విమర్శలు, పొగడ్తలు రావడం సాధారణమని అన్నాడు. టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ ధోనీ గ్రౌండ్ లో ఎంత ఒత్తిడిలో ఉన్నా బయటకు కనపడనీయడని, విమర్శలను ఎదుర్కోవడంలో ధోనీ పండిపోయాడని గంగూలి తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. భారత జట్టుకు కోచ్ గా వచ్చే ఆలోచన, తన జీవిత చరిత్ర రాసే ఉద్దేశం గురించి ప్రశ్నించగా.. ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదని, జీవిత చరిత్ర రాసేంత తీరిక లేదని సమాధానమిచ్చాడు.

  • Loading...

More Telugu News