: పొడవుగా ఉండే వారికి కేన్సర్ ప్రమాదం!


ఎత్తు తక్కువగా ఉన్న వారితో పోలిస్తే పొడుగుగా ఉన్నవారికి గుండె సంబంధిత వ్యాధులు, టైప్ 2 డయాబెటిక్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. కాకపోతే, కేన్సర్ బారిన పడే అవకాశాలు పొడుగాటి వారికి ఎక్కువగా ఉంటాయి. ఈ విషయాన్ని జర్మన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యుమన్ న్యూట్రిషన్ చేపట్టిన తాజా సర్వే పేర్కొంది. ఈ పరిశోధన వివరాలను లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండో క్రైనాలజీ జర్నల్ లో ప్రచురించారు. వయస్సు పెరిగే క్రమంలో వివిధ దశల్లో శరీరం పొడవు ఒక్కసారిగా పెరగడానికి అధిక క్యాలరీలు ఉండే యానిమల్ ప్రొటీన్ ఎక్కువగా తీసుకోవడం కారణమని జర్మన్ పరిశోధకులు అభిప్రాయపడ్డారు. కాగా, గతంలో నిర్వహించిన సర్వే ప్రకారం.. ఎత్తు తక్కువగా ఉన్న వారితో పోలిస్తే ఎక్కువగా ఉన్నవారికి గుండె సంబంధిత వ్యాధులు, టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువని పేర్కొంది.

  • Loading...

More Telugu News