: కాపు రిజర్వేషన్ల హామీని చంద్రబాబు నిలబెట్టుకోవాలి: కన్నా


ఆరు నెలల్లో కాపులను బీసీల్లో చేరుస్తామంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఏపీ ప్రభుత్వం నెరవేర్చనందునే ఆందోళనకు దిగామని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. ఇప్పుడా హామీని గుర్తు చేసేందుకే తుని సభ నిర్వహించాల్సి వచ్చిందని తెలిపారు. గుంటూరులో మీడియాతో ఈ మేరకు ఆయన మాట్లాడారు. కాపులు మంచి వాళ్లని చంద్రబాబు అన్నారని, మరిప్పుడు కేసులెందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. అయినప్పటికీ తాము కేసులకు భయపడమని, జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని కన్నా స్పష్టం చేశారు. ఏదేమైనా కాపు రిజర్వేషన్ల హామీని చంద్రబాబు నిలబెట్టుకోవాలని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News