: ఢిల్లీలో ప్రధాని కాన్వాయ్ పైకి పూలకుండీ విసిరిన మహిళ!
ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాన్వాయ్ పైకి ఓ మహిళ పూలకుండీ విసిరిన ఘటన చోటు చేసుకుంది. రాజధానిలోని విజయ్ చౌక్ సమీపంలో ఈ ఘటన జరిగింది. దాంతో కొద్దిసేపు మోదీ ప్రయాణానికి ఆటంకం కలిగింది. ఆ వెంటనే పూలకుండీ విసిరిన మహిళను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఆమె ఎందుకు ఇలా చేసిందన్న దానికి కారణాలు ఇంకా వెల్లడికాలేదు.