: విజయవాడలో అగ్నిప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రులు... ఆదుకుంటామని బాధితులకు హామీ
విజయవాడలో ఈ మధ్యాహ్నం పూల మార్కెట్ సమీపంలో జరిగిన అగ్నిప్రమాద ప్రాంతాన్ని మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర తదితరులు పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 110 ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయని, వివరాలు సేకరిస్తున్నామని మంత్రులు చెప్పారు. ప్రభుత్వ పరంగా తప్పకుండా ఆదుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు. వారికి పక్కా ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. అనూహ్యంగా జరిగిన ఈ ఘటనలో ఓ వృద్ధురాలు సజీవదహనమవగా, పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.