: బీజేపీ అభ్యర్థిపై దాడి ఘటనలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పై కేసు


బీజేపీ అభ్యర్థి మహేందర్ పై దాడి చేసిన ఘటనలో ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీపీ చాంద్రాయణ గుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ లో 143, 147, 324, 382, 506, 149 సెక్షన్ల కింద అక్బర్, ఇతర నేతలపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. నిన్న (మంగళవారం) జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ సమయంలో పోలింగ్ కేంద్రంలోనే జంగంమెంట్ బీజేపీ అభ్యర్థి అయిన మహేందర్ పై అక్బర్ దాడికి దిగారు. మహేందర్ భార్యపై మజ్లిస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు.

  • Loading...

More Telugu News