: వీధి రౌడీల్లా తీహార్ జైలు వార్డర్లు!... ఢిల్లీ నడి వీధుల్లో బాహాబాహీ


నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత దేశ రాజధాని ఢిల్లీ నడి వీధుల్లో ఇద్దరు పోలీసు అధికారులు బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. పోలీసు స్టిక్కర్ అతికించి ఉన్న కారులో కూర్చునే సదరు పోలీసులు ముష్టి ఘాతాలు విసురుకున్నారు. దీనిని గమనించిన స్థానికులు ఈ మొత్తం ఎపిసోడ్ ను తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టేశారు. ఢిల్లీలోని జనక్ పురి ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో పిడిగుద్దులు కురిపించుకున్న ఇద్దరు పోలీసులు తీహార్ జైలు వార్డర్లని ఆ తర్వాత తెలిసింది. ఈ ఘర్షణలో ఇద్దరు వార్డర్లకు రక్త గాయాలయ్యాయి. స్థానికులు వచ్చి వారిస్తే గాని, వారు ఈ లోకంలోకి రాలేదు.

  • Loading...

More Telugu News