: ఈడీ నుంచి జగన్ కు పిలుపు... రేపు ఢిల్లీకి విపక్ష నేత
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. రేపు ఢిల్లీలోని తమ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలంటూ అందులో తెలిపారు. దాంతో విచారణకు హాజరయ్యేందుకు ఆయన రేపు ఢిల్లీ వెళుతున్నట్టు సమాచారం. అక్కడి ఖాన్ మార్కెట్ లో ఉన్న ఈడీ ప్రధాన కార్యాలయంలో ఆయనను ప్రశ్నించనున్నారు. ఇప్పటికే వైసీపీ నేత, ఆడిటర్ విజయసాయిరెడ్డికి కూడా సమన్లు ఇవ్వగా ఆయన ఇవాళ ఢిల్లీ వెళుతున్నట్టు తెలిసింది. క్విడ్ ప్రోకో కింద భారీ మొత్తంలో జగన్ కంపెనీలలోకి వచ్చిన పెట్టుబడులపై ఈడీ తరపున ఇంకా కాన్ని చార్జిషీట్లు పెండింగ్ లో ఉన్నాయి. దానికి సంబంధించే వారిద్దరిని ప్రధానంగా విచారించనున్నారు.