: ముద్రగడ వద్ద రెండు తుపాకులు... స్వాధీనం చేసుకున్న పోలీసులు
తూర్పు గోదావరి జిల్లా తునిలో జరిగిన కాపు ఐక్య గర్జనలో చోటుచేసుకున్న హింసకు సంబంధించిన కేసు దర్యాప్తులో ఏపీ పోలీసులు వేగం పెంచారు. ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించి 76 కేసులు నమోదు చేసిన పోలీసులు ‘గర్జన’కు పిలుపునిచ్చిన కాపు నేత ముద్రగడ పద్మనాభంపైనా అభియోగాలు మోపారు. ఇక నేటి తెల్లవారుజామున ముద్రగడ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయన ఇంటిలో ముమ్మరంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా అక్కడ లభించిన ముద్రగడకు చెందిన రెండు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముద్రగడ ఇంటిలో సోదాలు, రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నారన్న వార్తలపై కాపు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.