: పాక్ లో హిందూ దేవాలయాన్ని అపవిత్రం చేసిన దుండగులు


పాకిస్థాన్ లోని కరాచీలో హిందూ దేవాలయాన్ని ముగ్గురు ఆగంతుకులు అపవిత్రం చేసిన ఘటన చోటుచేసుకుందని అక్కడి డాన్ పత్రిక కథనం ప్రచురించింది. 60 ఏళ్ల నాటి దేవాలయంలోకి బాగా గడ్డం పెంచి, కుర్తా పైజామా ధరించిన సాయుధులైన ముగ్గురు దుండగులు ప్రవేశించారని తెలిపింది. అక్కడ ప్రార్థనల్లో ఉన్న భక్తులను బయటకు వెళ్లిపోవాలని తుపాకులు చూపి ఆదేశించారు. వారంతా బయటకు వెళ్లిపోయిన తరువాత దేవాలయం గర్భగుడిలోకి వెళ్లి అక్కడ కొలువైన శీతలమాత, సంతోషిమాత, భవానీ మాత విగ్రహాలను అపవిత్రం చేశారు. సంతానం లేని వారు ఇక్కడి దేవాలయంలో పూజలు చేస్తే పిల్లలు పుడతారన్నది భక్తుల విశ్వాసం. దీంతో ఎంతో మంది పూజలు చేస్తుంటారు. ఇప్పుడు అపవిత్రం జరిగిన నేపథ్యంలో, ఈ ఆలయంలోకి వచ్చి పూజలు చేసేందుకు భక్తులు భయపడుతున్నారని ఆలయ ధర్మకర్త సాక్షి మహరాజ్ తెలిపారు. 60 ఏళ్ల క్రితం భారత్ నుంచి వలస వచ్చిన తన తాత ఈ దేవాలయం నిర్మించారని ఆయన తెలిపారు. పిల్లలు లేకపోవడంతో 14 ఏళ్ల మోహన్ అనే బాలుడ్ని ఆయన దత్తత తీసుకున్నారని ఆయన చెప్పారు. అనంతరం చంపాబాయి అనే మహిళతో వివాహం జరిపారని, వారికి కలిగిన సంతానం తానేనని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News