: గ్రేటర్ ఎగ్జిట్ పోల్స్ వివరాలు ఇవిగో!
గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ముగిసిన సందర్భంగా టీవీ9 ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించింది. గ్రేటర్ ఎన్నికల్లో పార్టీలన్నీ హోరాహోరీ తలపడ్డాయని ఆ టీవీ ఛానెల్ పేర్కొంది. ఈ సందర్భంగా 'గెలుపు గుర్రం టీఆర్ఎస్ పార్టీ' అని స్పష్టం చేసింది. తమ ఛానెల్ జరిపిన సర్వేల్లో టీఆర్ఎస్ 78-82, టీడీపీ, బీజేపీ కూటమి 28-33, కాంగ్రెస్ 8-10, ఎంఐఎం 35-40, ఇతరులు 1-8 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. అత్యధిక స్థానాలు గెలుచుకున్న ఏకైక పార్టీగా టీఆర్ఎస్ ఆవిర్భవించనుందని వెల్లడించింది.