: పాతబస్తీకి బయలుదేరిన తెలంగాణ హోంమంత్రి


హైదరాబాద్ పాతబస్తీలోని అజంపురాకు తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి బయలుదేరి వెళుతున్నారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ నివాసంపై ఎంఐఎం కార్యకర్తలు దాడి చేయడంతో అక్కడి పరిస్థితులను స్వయంగా పర్యవేక్షించేందుకు ఆయన అక్కడికి వెళుతున్నారు. కాగా, మహమూద్ అలీని మలక్ పేట ఎమ్మెల్యే బలాలా నెట్టేయడం, కుమారుడిపై మజ్లిస్ కార్యకర్తలు దాడికి పాల్పడటంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. అంతకుముందు, పాతబస్తీలోని పూరానాపూల్ లో కాంగ్రెస్, మజ్లిస్ కార్యకర్తల ఘర్షణ సంఘటనలో కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీకి స్వల్పగాయాలైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News