: కాపు నివేదిక కోసం 9 నెలలు ఎదురు చూడాలనుకుంటున్నాం: కాపు సంఘాల నేతలు


మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నిర్వహించిన కాపు గర్జన సభతో కాపు రిజర్వేషన్ల అంశం ఒక్కసారిగా వేడెక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాపు కమిషన్ తన నివేదికను సమర్పించేందుకు 9 నెలల సమయం పడుతుందని, ఆ నివేదిక కోసం తొమ్మిది నెలలు ఎదురు చూడాలనుకుంటున్నామని కాపు సంఘాల నేతలు తెలిపారు. నివేదిక వచ్చిన తరువాత కూడా సర్కారు స్పందించకపోతే ఉద్యమించడం సబబే అవుతందని చెప్పారు. విజయవాడలో సీఎం చంద్రబాబును కలిసేందుకు వచ్చిన సమయంలో వారు మీడియాతో మాట్లాడారు. తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.

  • Loading...

More Telugu News