: పఠాన్ కోట్ లో పాక్ అనుమానిత గూఢచారి అరెస్టు


పంజాబ్ లోని పఠాన్ కోట్ లో పాక్ అనుమానిత గూఢచారిని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. ఇర్షాద్ అహ్మద్ అనే వ్యక్తి మమూన్ కంటోన్మెంట్ లోని 29వ డివిజన్ లో హెడ్ క్వార్టర్స్ లో కూలీగా పని చేస్తున్నాడు. అతను పాకిస్థాన్ కు గూఢచారిగా వ్యవహరిస్తున్నాడని సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. దీంతో అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతని మొబైల్ లో అనుమానాస్పద ఇన్ స్టలేషన్ ఉన్నట్టు గుర్తించారు. దీంతో అతనిని విచారిస్తున్నారు. కాగా, గత నెలలో పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి అనంతరం భద్రతా బలగాలు కట్టుదిట్టమైన పహారా ఏర్పాటు చేశాయి.

  • Loading...

More Telugu News