: 12 గంటలకు 21.65 శాతం... ఒంటిగంటకు 25.85 శాతం పోలింగ్
గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ మధ్యాహ్నం 12 గంటల వరకు 21.65 శాతం పోలింగ్ నమోదైంది. ఒంటిగంటకు 25.85 శాతం పోలింగ్ నమోదైందని ఈసీ తెలిపింది. ఉదయం నుంచే పోలింగ్ మందకొడిగా ప్రారంభమవగా తరువాత కొద్దిగా పుంజుకుంది. అయినప్పటికీ ఎన్నికల సంఘం ఊహించిన దానికంటే చాలా తక్కువగానే పోలింగ్ నమోదవుతోంది. సాయంత్రానికి పోలింగ్ 60 శాతానికి చేరుకుంటుందన్న అంచనా ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు. ముఖ్యంగా యువత ఓటింగ్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.