: నిరుద్యోగుల ఉసురు బాబుకు తగులుతుంది: జగన్
నిరుద్యోగుల ఉసురు చంద్రబాబుకు తప్పక తగులుతుందని వైఎస్సార్సీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. శ్రీకాకుళంలో నిర్వహిస్తున్న యువభేరీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘బాబు సీఎం అయ్యారు.. 37 వేల ఫీల్ట్ అసిస్టెంట్ల ఉద్యోగాలు పోయాయి. గోపాలమిత్ర ఉద్యోగాలు పోయాయి. రెండు లక్షల ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు గాల్లో ఉన్నాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలవుతున్నా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడటం లేదు. నిరుద్యోగుల ఉసురు బాబుకు తప్పకుండా తగులుతుంది’ అని జగన్ మండిపడ్డారు.