: పోలీసుల అదుపులో ముఖేష్ గౌడ్ కుమార్తె... పోలీసులతో కేకే కూతురు వాగ్వాదం


బల్దియా ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నప్పటికీ కొన్నిచోట్ల చిన్న చిన్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. డబ్బులు పంపిణీ చేస్తున్నారన్న అభియోగంతో మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమార్తె శిల్పారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. గన్ ఫౌండ్రీ ప్రాంతంలో కార్యకర్తలకు ఆమె డబ్బులు పంచుతుండగా అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. మరోవైపు బంజారాహిల్స్ నుంచి పోటీ చేస్తున్న టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు కేశవరావు కుమార్తె విజయలక్ష్మి ఎన్ బీటీ నగర్ లో ఆందోళన చేస్తున్నారు. ఓటర్ కార్డులున్నా కొంతమందిని అడ్డుకుంటున్నారని నిరసన తెలిపారు. ఈ సమయంలో తనను అడ్డుకుంటున్న పోలీసులతో ఆమె గొడవకు దిగారు.

  • Loading...

More Telugu News