: భారత్ లోని కీలక స్థావరాలపై ఐఎస్ గురి!
భారత్ లోని మహారాష్ట్ర, గోవాల్లోని కీలక స్థావరాలపై, ఇక్కడికి వచ్చే విదేశీయులపై ఐఎస్ఐఎస్ గురిపెట్టినట్లు మహారాష్ట్ర ఉగ్రవాద నిర్మూలన దళం(ఏటీఎస్) గుర్తించింది. మహారాష్ట్ర ఏటీఎస్ అధికారుల సమాచారం మేరకు.. మహారాష్ట్రలో సురక్షితంగా ఉండే ఇళ్ల కోసం ఐఎస్ ఉగ్రవాదులు గాలిస్తున్నారని, అందుకోసం ఏజెంట్లను సంప్రదించారని ఏటీఎస్ అధికారులు పేర్కొన్నారు. ముంబై, పుణె, గోవాలోని నేవీ, ఎయిర్ పోర్స్ స్థావరాలపై ఉగ్ర దాడికి పథకం పన్నారన్న విషయాన్ని మహారాష్ట్ర ఉగ్రవాద నిర్మూలన దళం అధికారులు గుర్తించారు.