: ఓటు వేస్తేనే ప్రశ్నించే హక్కు వస్తుంది: జూ.ఎన్టీఆర్
సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. భార్య ప్రణతి, తల్లితో కలసి వచ్చిన ఆయన హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఓబుల్ రెడ్డి పాఠశాలలో ఓటు వేశారు. అనంతరం పోలింగ్ బూత్ బయట ఆయన మీడియాతో మాట్లాడుతూ, బాధ్యత గల పౌరుడిగా అందరూ వచ్చి ఓటు వేయాలని కోరారు. ఇది మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కని, ఇలాంటి గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. ఓటు వేస్తేనే ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ వస్తుందని తన భావన అని చెప్పారు. గతేడాది కంటే ఈ సారి ఓటింగ్ పై ప్రజల్లో అవగాహన పెరిగిందన్నారు. హైదరాబాద్ క్లీన్ అండ్ గ్రీన్ సిటీ అని, ఎప్పటికీ అలానే ఉండాలని కోరుకుంటున్నానని వివరించారు. ఈ సందర్భంగా జూనియర్ ను చూసేందుకు పలువురు ఆసక్తి కనబర్చారు.