: మరికొన్ని రోజుల్లో రాజధాని తుది మాస్టర్ ప్లాన్ రూపొందిస్తాం: మంత్రి నారాయణ
నవ్యాంధ్ర రాజధాని మాస్టర్ ప్లాన్ రూపొందించే విషయంపై మంత్రి నారాయణ స్పష్టత ఇచ్చారు. ఈ నెల 3న సింగపూర్ బృందం విజయవాడకు వస్తుందని, అప్పుడే గతంలోని మాస్టర్ ప్లాన్ అంశాలను స్టడీ చేస్తామని విజయవాడలో తెలిపారు. ఈ నెల 15లోగా తుది మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని చెప్పారు. ఇక రేపటి నుంచి తాత్కాలిక రాజధాని టెండర్లు తెరవనున్నామన్నారు. రహదారుల కోసం 6 గ్రామాల్లో 8 ఇళ్లు తొలగించనున్నామని వివరించారు. రాజధాని రైతుల్లో ఆందోళన లేదని, అలా ఉందని చెప్పడం సరికాదని పేర్కొన్నారు. ఇదే సమయంలో ముద్రగడ కాపు దీక్షపై మంత్రి స్పందించారు. ఏ డిమాండ్ తో దీక్ష చేయాలనుకుంటున్నారో చెప్పాలన్నారు. 9 నెలల్లో కాపు కమిషన్ నివేదికను పరిశీలించి, కాపు రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.