: తెలుగుదేశం అభ్యర్థికి సహకరిస్తున్నారంటూ, పోలీసులతో తెరాస ఎమ్మెల్సీ వాగ్వాదం
బందోబస్తుకు వచ్చిన పోలీసులు తెలుగుదేశం అభ్యర్థికి సహకరిస్తున్నారని ఆరోపిస్తూ, తెరాస నేతలు నిరసనకు దిగడంతో హబ్సిగూడ గిరిజనబస్తీ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కార్యకర్తల ద్వారా విషయం తెలుసుకున్న తెరాస ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఉప్పల్ తెరాస ఇన్ చార్జ్ సుభాష్ రెడ్డి పోలింగ్ కేంద్రానికి చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వారికి మద్దతుగా పెద్దఎత్తున తెరాస కార్యకర్తలు రావడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వెంటనే విషయాన్ని తెలుసుకున్న ఉన్నతాధికారులు హబ్సిగూడకు అదనపు బలగాలను తరలించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా గిరిజన బస్తీని చుట్టుముట్టి నిరసనకారులను చెదరగొట్టారు.