: పలు చోట్ల మొరాయించిన ఈవీఎంలు, పాతబస్తీలో ఉద్రిక్తత
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో భాగంగా పలు చోట్ల ఏర్పాటు చేసిన ఈవీఎం యంత్రాలు మొరాయించినట్టు తెలుస్తోంది. ఉప్పల్, రామాంతపూర్, కూకట్ పల్లి తదితర ప్రాంతాల్లోని పోలింగ్ బూత్ లలో ఇంకా ఓటింగ్ ప్రారంభం కాలేదు. ఇక్కడి ఈవీఎంలలో సాంకేతిక లోపాలు తలెత్తాయని, తాము తక్షణం స్పందించి నిపుణులను పంపామని, ఈవీఎంలు పనిచేయకుంటే, వాటిని మార్చేస్తామని ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించారు. మరోవైపు పాతబస్తీ పరిధిలోని కొన్ని పోలింగ్ బూత్ ల వద్ద బీజేపీ, ఎంఐఎం ఏజంట్ల మధ్య వివాదం కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. పోలింగ్ స్టేషన్ల వెలుపల నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ, బీజేపీ-టీడీపీ కార్యకర్తలతో పాటు ఎంఐఎం, ఎంబీటీ పార్టీల కార్యకర్తలు మోహరించడంతో ఆయా ప్రాంతాలకు మరిన్ని బలగాలను తరలించారు.