: తుని ఘటన దురదృష్టకరం: సీఎం చంద్రబాబు
తుని ఘటన చాలా దురదృష్టకరమని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తుని ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడారు. కాపు రిజర్వేషన్ ముసుగులో నేరస్తులంతా ఒక చోటుకి చేరారని ఆయన ఆరోపించారు. కొన్ని అసాంఘిక శక్తులు ఇదంతా ముందస్తు వ్యూహంతో చేసిన పనేనని అన్నారు. ఇటువంటి అఘాయిత్యాలు చేయడమేంటి? మళ్లీ సమర్థించుకోవడమేమిటి? అని బాబు ప్రశ్నించారు. రైలుతో, వాహనాలతో, పోలీస్ స్టేషన్ తో కాపు రిజర్వేషన్లకు ఏమిటీ సంబంధమంటూ బాబు ప్రశ్నించారు.