: విహారయాత్రలో విషాదం...13 మంది విద్యార్థుల మృతి!
పూణె కళాశాల విద్యార్థుల విహార యాత్ర విషాదం మిగిల్చింది. అబేదా ఇనమ్దార్ కళాశాలకు చెందిన కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన సుమారు 130 మంది విద్యార్థులు రాయ్ గడ్ జిల్లాలోని మురద్ బీచ్ కు ఈరోజు విహారయాత్రకు వెళ్లారు. చారిత్రాత్మక మురద్ జాంజిరా కోటకు సమీపంలోని ఈ బీచ్ వద్దకు వెళ్లిన విద్యార్థులు సముద్రం ఒడ్డున ఆటలాడుకుంటుండగా, అకస్మాత్తుగా వచ్చిన అలలు వారిని నీటి లోపలికి లాక్కుపోయాయి. ఈ సంఘటనలో 13 మంది విద్యార్థులు మృతి చెందారు. ఇందులో పదిమంది అమ్మాయిలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల సహాయంతో కొన్ని మృతదేహాలను బయటకు తీశామని, మిగిలిన మృతదేహాల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు.