: లైంగిక వేధింపులకు పాల్పడ్డ 'యోగా గురు'కు భారీ జరిమానా!
ఒక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నిరూపణ కావడంతో యోగా గురు బిక్రమ్ చౌదురికి లాస్ ఏంజిల్స్ కోర్టు భారీ జరిమానా విధించింది. సుమారు తొమ్మిది లక్షల డాలర్లు నష్టపరిహారంగా చెల్లించాలని లాస్ ఏంజిల్స్ జ్యూరీ ఆదేశించింది. కాగా, తనపై బిక్రమ్ వేధింపులకు పాల్పడ్డాడంటూ మీనాక్షీ జాఫా బోడెన్ అనే మహిళ ఫిర్యాదు చేసింది. హోటల్ గదిలో తనతో ఉండాలని బలవంతం చేయడం, తనను తాకేందుకు యత్నించడం వంటి పనులకు బిక్రమ్ చౌదురి పాల్పడ్డాడనేవి ఆమె చేసిన ఆరోపణలు. ఈ నేపథ్యంలో 2013 జూన్ లో బాధితురాలు కోర్టును ఆశ్రయించినట్లు బోడెన్ తరపు న్యాయవాది మిన్నర్డ్ చెప్పారు. గతంలో కూడా బిక్రమ్ చౌదురిపై లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. యోగ శిక్షణ పేరిట తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని కెనడా దేశానికి చెందిన ఒక మహిళ గతంలో కోర్టును ఆశ్రయించింది.