: 18 బంతుల్లో అర్ధసెంచరీ... అండర్ 19 ఆటగాడి రికార్డు


రాహుల్ ద్రవిడ్ శిక్షణలో అండర్ 19 జట్టు రాటుదేలుతోంది. భవిష్యత్ టీమిండియాను తయారు చేయడమే తన లక్ష్యం అని ప్రకటించిన రాహుల్ ద్రవిడ్ చెప్పింది చేసి చూపిస్తున్నాడు. నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో రిషబ్ పాంట్ కేవలం 18 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. 24 బంతుల్లో 9 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 78 పరుగులు సాధించాడు. దీంతో అండర్ 19లో వేగవంతమైన అర్ధసెంచరీగా ఇది రికార్డులకెక్కింది. అనంతరం క్రీజులోకి వచ్చిన సర్ఫ్ రాజ్ ఖాన్ (21), ఆర్మాన్ జాఫర్ (12) లు ఆడుతూ పాడుతూ లక్ష్యం చేరుకున్నారు. దీంతో భారత జట్టు నేపాల్ పై ఘనవిజయం సాధించింది.

  • Loading...

More Telugu News