: డబ్బులు పంచుతున్న టీఆర్ఎస్ కార్యకర్తలను బంధించిన స్థానికులు!


ఓటర్లకు డబ్బులు పంచుతున్న ఐదుగురు టీఆర్ఎస్ కార్యకర్తలను స్థానికులు బంధించిన సంఘటన హైదరాబాద్ యూసఫ్ గూడలోని కృష్ణానగర్ లో ఈరోజు జరిగింది. ఈ మేరకు కృష్ణానగర్ వాసులు జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వెంటనే సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఐదుగురు టీఆర్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. కాగా, నిన్నరాజేంద్రనగర్ డివిజన్ లో డబ్బులు పంచుతున్న టీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News