: ఒడిదుడుకుల మధ్య బేర్స్ ధాటికి తలవంచిన బుల్స్!
సెషన్ ఆరంభం నుంచి తీవ్ర ఒడిదుడుకుల మధ్య పైకీ కిందకూ పడుతూ, లేస్తూ, వచ్చిన సూచికలు మధ్యాహ్నం తరువాత నష్టాల్లోకి జారి పోయాయి. యూరప్ మార్కెట్ల సరళి ఇన్వెస్టర్ల సెంటిమెంటును హరించిందని నిపుణులు వ్యాఖ్యానించారు. సోమవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 45.86 పాయింట్లు పడిపోయి 0.18 శాతం నష్టంతో 24,824.83 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 7.60 పాయింట్లు పడిపోయి 0.10 శాతం లాభంతో 7,555.95 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.57 శాతం, స్మాల్ క్యాప్ 0.29 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో 22 కంపెనీలు లాభాల్లో నడిచాయి. అదానీ పోర్ట్స్, యస్ బ్యాంక్, అంబుజా సిమెంట్స్, భారతీ ఎయిర్ టెల్, కోల్ ఇండియా తదితర కంపెనీలు లాభపడగా, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, మారుతి సుజుకి, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్ తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 94,20,346 కోట్లకు పెరిగింది. బీఎస్ఈలో మొత్తం 2,831 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,427 కంపెనీలు లాభాలను, 1,262 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి.