: పాస్ పోర్ట్ మర్చిపోయిన ‘రజనీ’... ఎయిర్ పోర్టులో వెయిటింగ్!
ఒక చిత్రం షూటింగ్ నిమిత్తం ఈ రోజు ఉదయం చెన్నై నుంచి మలేషియాకు బయలుదేరిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన పాస్ పోర్ట్ ను మర్చిపోయారు. ఉదయం 11.45 గంటలకు విమానం బయలుదేరాల్సి ఉండగా ఆఖరి నిమిషంలో తన పాస్ పోర్ట్ మర్చిపోవడంతో రజనీ, ఆయన వెంట ఉన్న వారు కంగారుపడ్డారు. వెంటనే, ఇంటికి ఫోన్ చేయడంతో పాస్ పోర్ట్ తీసుకుని ఆయన సహాయకులు ఎయిర్ పోర్ట్ కు వెళ్లడంతో రజనీ బయలుదేరి వెళ్లారు. అయితే, పాస్ పోర్ట్ తీసుకువచ్చే వరకూ రజనీ, ఆయనతో ఉన్న నిర్మాత కలైపులి ఎస్.థాను కూడా కారులోనే ఉన్నారు.