: టీమిండియాతో పాటు కోహ్లీ కూడా నెంబర్ వన్
ఆసీస్ పర్యటన ప్రారంభంలో వరుస పరాజయాలతో డీలాపడ్డ టీమిండియా చివర్లో పుంజుకుని వరుస విజయాలతో ఆస్ట్రేలియా జట్టును బెంబేలెత్తించింది. దీంతో ఒక్కసారిగా భారత జట్టు టీట్వంటీల్లో ఎనిమిదో స్థానం నుంచి నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ఈ మూడు టీట్వంటీల్లో అర్ధ సెంచరీలతో ఆసీస్ బౌలింగ్ ను తుత్తునియలు చేసిన కోహ్లీ వరల్డ్ నెంబర్ వన్ టీట్వంటీ బ్యాట్స్ మన్ గా నిలిచాడు. కోహ్లీ బ్యాటింగ్ ధాటికి అప్పటి వరకు వరల్డ్ నెంబర్ వన్ గా ఉన్న ఆసీస్ టీట్వంటీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ నెంబర్ టూగా నిలిచాడు. తాజా టీట్వంటీ ర్యాంకింగ్స్ లో టీమిండియా ఆటగాడు సురేష్ రైనా (13) మూడు స్థానాలు మెరుగుపరుచుకోగా, రోహిత్ శర్మ (16) నాలుగు స్థానాలు మెరుగుపరుచుకున్నాడు.