: నీ మురళీ మోహన్, నారాయణ, సుజనాల భూములు తీసుకోలేదేం?: చంద్రబాబుకు జగన్ సూటి ప్రశ్న


అమరావతి పేరు చెప్పి రైతుల నుంచి బలవంతంగా భూములను తీసుకున్న చంద్రబాబు, తన బినామీలైన మురళీమోహన్, సుజనా చౌదరి, నారాయణ తదితరుల భూముల జోలికి మాత్రం వెళ్లలేదని, వీరందరికీ రాజధాని చుట్టుపక్కల భూములున్నాయని వైకాపా అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. వారి భూములను ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని వైకాపా ప్రశ్నిస్తే, తాము రాజధానికి వ్యతిరేకమన్న ప్రచారాన్ని తీసుకొస్తావా? అని నిప్పులు చెరిగారు. రైతుల భూములు తీసుకున్న చంద్రబాబు, ఎస్సీ, ఎస్టీలకిచ్చిన అసైన్డ్ భూములను సైతం తీసుకున్నారని, ఆపై వాటిని బడాబాబులకు అప్పగించే పనిలో పడ్డాడని విమర్శించారు. పోలవరం కట్టండయ్యా అంటే, తాము పట్టిసీమకు వ్యతిరేకమని ప్రచారం చేశాడని, కమిషన్ల కోసమే పట్టిసీమను 22 శాతం అదనపు మొత్తానికి కాంట్రాక్టులిచ్చారని, వైకాపా నిలదీస్తే, రాయలసీమకు తాము వ్యతిరేకమని అభాండాలు వేశారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News