: నారా భువనేశ్వరి ఓటు... మా గెలుపుపై ప్రభావం చూపబోదు: కేటీఆర్ కామెంట్స్


మొన్నటికి మొన్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సతీమణి నానా భువనేశ్వరి తమకే ఓటే వేస్తానని చెప్పిందంటూ టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు బహిరంగ సభా వేదిక మీదే ప్రకటించారు. అయితే తన ఓటు టీడీపీకేనని భువనేశ్వరి కేసీఆర్ కామెంట్లను కొట్టిపారేస్తూ తన కొడుకు నారా లోకేశ్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తాజాగా కేసీఆర్ తనయుడు కేటీఆర్... మరో ఆసక్తికర కామెంట్ చేశారు. అసలు తమకు నారా భువనేశ్వరి ఓటే అవసరం లేదన్నట్లుగా కేటీఆర్ కీలక వ్యాఖ్య చేశారు. ఓ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడిన కేటీఆర్... భువనేశ్వరి ఓటునూ ప్రస్తావించారు. ‘‘చంద్రబాబు విజయవాడలో ఉంటున్నారు. ఇక్కడి పరిస్థితులు ఆయనకు తెలియవు. కానీ, భువనేశ్వరి ఇక్కడే ఉండి వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఆమెకు అన్నీ తెలుసు. అందుకే ఆమె టీఆర్ఎస్ కు ఓటు వేస్తుందని సీఎం కేసీఆర్ చెప్పారు. అయినా, ఆమె ఒక్క ఓటు వేసినా, వేయకపోయినా టీఆర్ఎస్ గెలుపుపై ఏమాత్రం ప్రభావం ఉండదు’’ అని కేటీఆర్ అన్నారు.

  • Loading...

More Telugu News