: ‘కోడ్’ను పక్కాగా పాటించిన నారా లోకేశ్... వాచీలో అలారం సెట్ చేసుకున్న వైనం


ఎన్నికల సమయంలో ఆయా రాజకీయ పార్టీలు అనుసరించాల్సిన నియమ నిబంధనలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ప్రకటనలను జారీ చేస్తుంది. ఆ నిబంధనలను (ఎన్నికల కోడ్) అతిక్రమించే వారికి నోటీసులు జారీ చేయడమే కాక, వారిపై కఠిన చర్యలు తీసుకునే అధికారం కూడా ఎన్నికల సంఘానికి ఉంది. అయితే మన రాజకీయ నేతలు మాత్రం ఎన్నికల కోడ్ ను అంతగా పట్టించుకోరు. కానీ టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మాత్రం ఎన్నికల కోడ్ ను తుచ తప్పకుండా పాటిస్తున్నారు. నిన్న గ్రేటర్ ఎన్నికల ప్రచారం ముగిసింది. నిన్న ఉదయం నుంచి నగరంలోని వివిద ప్రాంతాల్లో జరిగిన ప్రచారంలో పాల్గొన్న లోకేశ్, సరిగ్గా గడువు ముగిసే సమయానికి ప్రచారాన్ని ముగించేశారు. ఇందుకోసం ఆయన తన చేతికున్న వాచీలో గడువు ముగియనున్న సమయానికి అలారాన్ని సెట్ చేసుకున్నారట. తన వాచీలో అలారం మోగగానే లోకేశ్ ప్రచారాన్ని ఆపేసి ఇంటికెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News