: డబ్బులు పంచిన అధికారపార్టీ నాయకులు...కాంగ్రెస్ నేతల ఆరోపణ!


హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ డివిజన్ శివరాంపల్లెలో అధికారపార్టీ నాయకులు డబ్బులు పంపిణీ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు రాజేంద్రనగర్ పోలీసు అధికారులకు వారు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకుని తాము అక్కడికి వెళుతున్న సమాచారాన్ని పసిగట్టిన టీఆర్ఎస్ నాయకులు ఆ డబ్బులను మరుగుదొడ్డిలో పడేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ నగదును రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరొకరు పరారయ్యారు. ‘గ్రేటర్’ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే టీఆర్ఎస్ పార్టీ నాయకులు నగదు పంపిణీ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు.

  • Loading...

More Telugu News