: ‘కాపు’ గర్జన హింసాత్మకం.. తుని పోలీస్ స్టేషన్ కు నిప్పు!
కాపు ఐక్య గర్జన సదస్సు హింసాత్మకంగా మారింది. కాపులను బీసీల్లో చేర్చాలంటూ సమావేశం నిర్వహించడం.. ‘కాపు’ నేత ముద్రగడ పద్మనాభం సమావేశం నుంచి నేరుగా ఆందోళనాకార్యక్రమాలకు దిగడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ విధ్వంసం సృష్టించారు. తుని రూరల్ పోలీస్ స్టేషన్ కు నిప్పుపెట్టారు. పోలీస్ స్టేషన్ లోని ఆయుధాలను, ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. ఈ సంఘటనలో ఒక కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలు బోగీలకు నిప్పుపెట్టడం, కోల్ కతా హైవేపై రాస్తారోకోతో తునిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.